Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రైస్ మిల్లర్లపై జరుగుతున్న విజిలెన్స్ దాడులను నిలిపివేయాలి..: రైస్ మిల్లర్ అసోసియేషన్ ములుగు జిల్లా అధ్యక్షుడు బాదం ప్రవీణ్

    Author PRAJA NADI NEWS | 28 Jul 2026, 06:51 PM | Array
    రైస్ మిల్లర్లపై జరుగుతున్న విజిలెన్స్ దాడులను నిలిపివేయాలి..: రైస్ మిల్లర్ అసోసియేషన్ ములుగు జిల్లా అధ్యక్షుడు బాదం ప్రవీణ్

    ---- మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేత

    ములుగు( ప్రజానాడి న్యూస్) : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్దేశపూర్వకంగా రైస్ మిల్లర్లపై జరుగుతున్న విజిలెన్స్ దాడులను వెంటనే నిలిపివేయాలని రైస్ మిల్లర్ అసోసియేషన్ ములుగు జిల్లా అధ్యక్షులు బాదం ప్రవీణ్ ప్రభుత్వాన్ని, అధికారులను కోరారు. ఈ మేరకు మంగళవారం ములుగు జిల్లాలోని రైస్ మిల్లర్లు అందరూ కలిసి మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిసి తమ గోడును వెలిబుచ్చడంతోపాటు రైస్ మిల్లర్ల పై జరుగుతున్న విజిలెన్స్ దాడులను ఆపే విధంగా చూడాలని వినతి పత్రం అందజేశారు. దానికి సానుకూలంగా స్పందించిన మంత్రి సీతక్క వెంటనే సంబంధిత శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడడంతోపాటు రైస్ మిల్లర్ల సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని ఆమె ఈ సందర్భంగా హామీ ఇవ్వడం జరిగింది. అనంతరం రైస్ మిల్లర్ అసోసియేషన్ ములుగు జిల్లా అధ్యక్షుడు బాదం ప్రవీణ్ మాట్లాడుతూ... ప్రభుత్వానికి, రైతు లకు మధ్య వారధిగా పనిచేస్తూ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం అయినా సన్న బియ్యం పథకాన్ని విజయవంతం చేసే క్రమంలో సన్నధాన్యం నుండి అవుటర్న్ రాక అనేక నష్టాల పాలవుతున్నామని అన్నారు. ధాన్యం కొనుగోలు సమయంలో రైస్ మిల్లర్ల పై ఒత్తిడి చేసి మిల్లు కెపాసిటీకి మించి అధిక ధాన్యం మిల్లర్ కు ఇచ్చి తదుపరి బియ్యం తీసుకోకపోవడం వలన ధాన్యంలో సహజంగా తరుగుదలను సాకుగా చూపించి మిల్లర్లు ప్రభుత్వ ధాన్యమును దుర్వినియోగం చేశారు అని ఉద్దేశపూర్వకంగా కేసులు పెడుతూ ఇండస్ట్రీ కుప్పకూలే విధంగా మిల్లర్లను కేసులో పాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏన్ని సమస్యలు ఉన్నా మిల్లర్లు వెనుకంజ వేయకుండా రైతుల కోసం పనిచేస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి రైస్ మిల్లర్లపై ఉద్దేశపూర్వకంగా విజిలెన్స్ అధికారులు దాడులు చేపట్టడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి రైస్ మిల్లర్లపై జరుగుతున్న విజిలెన్స్ దాడులను నిలిపివేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్ అసోసియేషన్ కార్యదర్శి సహోదరి రెడ్డి కోశాధికారి ఎలగందుల మోహన్ మరియు జిల్లా రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.

    రైస్ మిల్లర్లపై జరుగుతున్న విజిలెన్స్ దాడులను నిలిపివేయాలి..: రైస్ మిల్లర్ అసోసియేషన్ ములుగు జిల్లా అధ్యక్షుడు బాదం ప్రవీణ్  - Additional Image