Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నీట్ - యుజి 2026 ఫలితాలలో వైబ్రంట్ అకాడమి విజయదుంధిభి.

    Author PRAJA NADI NEWS | 17 Jul 2026, 08:05 PM | BUSINESS, TELANGANA
    నీట్ - యుజి  2026 ఫలితాలలో వైబ్రంట్ అకాడమి విజయదుంధిభి.

    నీట్ - యుజి 2026 ఫలితాలలో వైబ్రంట్ అకాడమి విజయదుంధిభి...


    నీట్ - యుజి 2026 ఫలితాలలో వైబ్రంట్ అకాడమి విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని వైబ్రంట్ అకాడమి డైరెక్టర్ సిహెచ్ రాజేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా అకాడమి డైరెక్టర్ సిహెచ్ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ పేద విద్యార్థుల కోసం కోటా రాజస్థాన్ వారి వైబ్రంట్ అకాడమిని వరంగల్ హన్మకొండలో స్థాపించామన్నారు. గురువారం విడుదల అయినా నీట్ యుజి -2026 ఫలితాలలో వైబ్రంట్ అకాడమి విద్యార్థులు అత్యధికంగా ర్యాంకులు సాధించారని, ఇలాంటి ర్యాంకులు మొదటి బ్యాచ్ సాధించడం చాలా సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు.వైబ్రంట్ అకాడమి మొదటి నుండి నీట్, జేఇఇ లలో అత్యుత్తమమైన శిక్షణను వరంగల్లో అందిస్తున్నామని తెలిపారు . గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులను సైతం చక్కటి అకాడిమిక్ ప్రోగ్రామింగ్, ప్రణాళికల ద్వారా అద్భుతమైన అణిముత్యాలుగా తయారుచేసి జాతీయ స్థాయిలోనే ఉన్నతమైన ర్యాంకులు సాధిస్తున్నామని తెలిపారు. తదనంతరం జాతీయ స్థాయిలో ఉన్నతమైన ఆల్ ఇండియా ర్యాంకు 143 బి. వినాయక్.హాల్ టికెట్ నెంబర్. 4205102271, 12 మంది అత్యుత్తమైన ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు.అనుభవజ్ఞులైన అధ్యాపకులతో నిరంతర పర్యవేక్షణ,యోగా, మోటివేషన్ తో మామూలు విద్యార్థులను కూడా మెరికలు తిరిగిన విద్యార్థులుగా తీర్చి దిద్దడం జరుగుతుందని, ప్రతి విద్యార్థిపైన వ్యక్తిగతమైన శ్రద్ద తీసుకోవడం వలనే ఈ ఫలితాలు సాధించారని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వైబ్రెంట్ అకాడమి ప్రిన్సిపాల్ టి. శేషుకుమార్, అడ్మినిస్ట్రేషన్ హెడ్ జి. రఘుపతి, కోఆర్డినేటర్ రామ్ గుమ్మడి, అధ్యాపక బృందం మరియు బోదనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.