Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • అంతర్జాతీయ వేదికపై తెలంగాణ ఖ్యాతిని చాటిన మంత్రి సీతక్క....

    Author PRAJA NADI NEWS | 25 Jul 2026, 07:20 PM | Politics, TELANGANA
    అంతర్జాతీయ వేదికపై తెలంగాణ ఖ్యాతిని చాటిన మంత్రి సీతక్క....

    --అమెరికా పర్యటన విజయవంతం...
    --అభినందించిన జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్


    ములుగు ప్రజానాడి న్యూస్ :ప్రవాస భారతీయ తెలుగు మహాసభల్లో పాల్గొనేందుకు అమెరికా పర్యటనకు వెళ్లిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖల మంత్రి `డాక్టర్ దనసరి అనసూయ సీతక్క స్వదేశానికి విజయవంతంగా తిరిగి వచ్చారు.
    ఈ సందర్భంగా ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు `పైడాకుల అశోక్ మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు.
    అమెరికా వేదికపై తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, మహిళా సాధికారత, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను సీతక్క ప్రపంచానికి సమర్థవంతంగా పరిచయం చేశారని అశోక్ పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ గౌరవాన్ని, ఖ్యాతిని మరింత పెంచినందుకు మంత్రి నాయకత్వాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
    ప్రజల సంక్షేమే ధ్యేయంగా పనిచేస్తున్న సీతక్క నాయకత్వంలో రాష్ట్రంతో పాటు ములుగు జిల్లా కూడా అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతుందని అశోక్ విశ్వాసం వ్యక్తం చేశారు. ముఖ్యంగా గిరిజన, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మంత్రి తీసుకుంటున్న చర్యలు ఫలితాలను ఇస్తున్నాయని తెలిపారు.
    అమెరికా పర్యటన అనంతరం స్వదేశానికి చేరుకున్న సీతక్కకు స్వాగతం పలుకుతూ, ఆమె సంపూర్ణ ఆయురారోగ్యాలతో, మరిన్ని విజయాలు సాధించాలని, తెలంగాణ ప్రజలకు మరెన్నో సేవలు అందించాలని అశోక్ ఆకాంక్షించారు.

    అంతర్జాతీయ వేదికపై తెలంగాణ ఖ్యాతిని చాటిన మంత్రి సీతక్క.... - Additional Image