రైస్ మిల్లర్లపై జరుగుతున్న విజిలెన్స్ దాడులను నిలిపివేయాలి..: రైస్ మిల్లర్ అసోసియేషన్ ములుగు జిల్లా అధ్యక్షుడు బాదం ప్రవీణ్

---- మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేత ములుగు( ప్రజానాడి న్యూస్) : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్దేశపూర్వకంగా రైస్ మిల్లర్లపై జరుగుతున్న విజిలెన్స్ దాడులను వెంటనే నిలిపివేయాలని రైస్ మిల్లర్ అసోసియేషన్ ములుగు జిల్లా అధ్యక్షులు బాదం ప్రవీణ్ ప్రభుత్వాన్ని, అధికారులను కోరారు. ఈ మేరకు మంగళవారం ములుగు జిల్లాలోని రైస్ మిల్లర్లు అందరూ కలిసి మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిసి తమ గోడును వెలిబుచ్చడంతోపాటు రైస్ మిల్లర్ల పై జరుగుతున్న విజిలెన్స్ దాడులను ఆపే విధంగా చూడాలని వినతి పత్రం అందజేశారు. దానికి సానుకూలంగా స్పందించిన మంత్రి సీతక్క వెంటనే సంబంధిత శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడడంతోపాటు రైస్ మిల్లర్ల...