Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఎల్లారెడ్డిపల్లిలో ఘనంగా వన మహోత్సవం....

    Author PRAJA NADI NEWS | 25 Aug 2026, 02:48 PM | Array
    ఎల్లారెడ్డిపల్లిలో ఘనంగా వన మహోత్సవం....

    వెంకటాపూర్( ప్రజానాడి) :రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా,స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు, ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్ సూచనలతో వెంకటాపూర్ మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో వన మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
    గ్రామ సర్పంచ్ బాషబోయిన పోషాలు యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మొక్కలు నాటారు.
    అనంతరం సర్పంచ్ పోషాలు యాదవ్ మాట్లాడుతూ ప్రకృతి పరిరక్షణకు మొక్కలు నాటడం ఎంతో అవసరమని, కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు.
    ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బండి శ్రీనివాస్, ఉప సర్పంచ్ పులి నర్సయ్య, రామప్ప ట్రస్ట్ బోర్డు చైర్మన్ మిల్కూరి ఐలయ్య, జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యదర్శి మేకల రాజేష్, నాయకులు జంగిలి రవి, బొచ్చు సమ్మయ్య, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

    ఎల్లారెడ్డిపల్లిలో ఘనంగా వన మహోత్సవం.... - Additional Image