రామప్పకు పూర్వ వైభవం - భక్తులకు మెరుగైన సౌకర్యాలు
--- ఆలయ ఈవో ఇమ్మడి భాస్కర్ సేవలు అభినందనీయం: రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాదం ప్రవీణ్.. వెంకటాపూర్ (ప్రజానాడి న్యూస్ ): భక్తి భావంతో పాటు అరుదైన సేవా దృక్పథం కలిగిన అధికారి రామప్ప ఆలయ ఈవో ఇమ్మడి భాస్కర్ అని ములుగు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బాదం ప్రవీణ్ కొనియాడారు. ఆదివారం యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడమైన పాలంపేటలోని రామప్ప దేవాలయాన్ని దర్శించుకున్న అనంతరం, ఆలయ కార్యనిర్వహణ అధికారి ఇమ్మడి భాస్కర్ ను ఆయన ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బాదం ప్రవీణ్ మాట్లాడుతూ, వందల ఏళ్ల నాటి రామప్ప ఆలయ ప్రధాన సోమసూత్ర ద్వార సమస్యను భారత...