రామప్ప ఆయకట్టు రైతులకు వెంటనే సాగునీరు అందించాలి: బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు లింగాల రమణారెడ్డి..
వెంకటాపూర్ (ప్రజానాడి న్యూస్) : రామప్ప చెరువు ఆయకట్టు రైతులకు వెంటనే సాగునీరు అందించాలని బీఆర్ఎస్ పార్టీ వెంకటాపూర్ మండల అధ్యక్షులు లింగాల రమణారెడ్డి డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ రామప్ప చెరువు కింద అధికారికంగా 5 వేల ఎకరాలు, అనధికారికంగా మరో 5 వేల ఎకరాల భూములు సాగవుతున్నాయని అన్నారు. రామప్ప చెరువు నీటిని ఇతర ప్రాంతాలకు తరలించే కుట్రలో భాగంగానే నేడు రామప్ప ఆయకట్టు రైతులకు నీరు అందించడం లేదని పేర్కొన్నారు. తలాపునే సముద్రం లాంటి రామప్ప చెరువును పెట్టుకొని స్థానిక రైతులు సాగునీటికి తల్లాడడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం...