మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించిన మంత్రి సీతక్క
--- అత్యుత్తమ వైద్యం అందించాలని వైద్యులకు సూచన హైదరాబాద్ (ప్రజానాడి న్యూస్) : హైదరాబాద్ లోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని రాష్ట్ర మంత్రి సీతక్క బుధవారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడిన మంత్రి, వారికి ధైర్యం చెప్పారు. పెద్ది సుదర్శన్ రెడ్డికి అందుతున్న వైద్య చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రోగికి అవసరమైన అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని వైద్య బృందానికి సూచించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన మంత్రి సీతక్క, కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సమయంలో ప్రభుత్వం తరఫున అవసరమైన...