ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సీతక్క - మీనాక్షి భేటీ

ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సీతక్క - మీనాక్షి భేటీ... --- నిరుద్యోగులను ముంచింది బీఆర్‌ఎస్: సీతక్క హైదరాబాద్, జులై 17, (ప్రజానాడి): ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో శనివారం ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌తో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సమావేశమయ్యారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, ప్రభుత్వ పథకాల అమలు, స్థానిక సమస్యలపై దాదాపు గంటపాటు ఇరువురూ చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగులను నిలువునా ముంచిన చరిత్ర బీఆర్‌ఎస్‌దేనని ఆరోపించారు. పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్ కనీసం లక్ష ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని, ఇప్పుడు ఉద్యోగం పోగానే నిరుద్యోగులు గుర్తొచ్చారా అని ప్రశ్నించారు. నిరుద్యోగులు తస్మాత్ జాగ్రత్త, బీఆర్‌ఎస్‌ను నమ్ముకుంటే నష్టపోతారని...