తెలంగాణ వారసత్వాన్ని ప్రపంచానికి చాటేలా హెరిటేజ్ రన్
తెలంగాణ వారసత్వాన్ని ప్రపంచానికి చాటేలా హెరిటేజ్ రన్' *గుంజేడు ముసలమ్మ ఆలయం నుంచి ఏకశిలా పార్కు వరకు .*నిఖిల్ కుమార్ సాహస యాత్ర ములుగు, జూలై 17: తెలంగాణ సంస్కృతి, చారిత్రక వారసత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు ఫిట్‌నెస్‌పై అవగాహన పెంచే లక్ష్యంతో ములుగు జిల్లాకు చెందిన గిరిజన యువకుడు, ఎన్‌ఐటీ కాలికట్ విద్యార్థి, ఎండ్యూరెన్స్ స్పోర్ట్స్ లో పాల్గొంటున్న సందర్భంగా నిఖిల్ కుమార్ ఆధ్వర్యంలో 'తెలంగాణ హెరిటేజ్ రన్' నిర్వహించనున్నారు. జూలై 19 (ఆదివారం) అర్ధరాత్రి 12 గంటలకు గుంజేడు ముసలమ్మ ఆలయం నుంచి ప్రారంభమయ్యే ఈ 70 కిలోమీటర్ల హెరిటేజ్ రన్, ఉదయం 8 గంటలకు హనుమకొండలోని ఏకశిలా పార్కు...