🏠 prajanadinews.in
Watermark
Newspaper Logo
prajanadinews.in | Date: 12 Oct, 2026 | Page: 1

రామప్పకు పూర్వ వైభవం - భక్తులకు మెరుగైన సౌకర్యాలు

--- ఆలయ ఈవో ఇమ్మడి భాస్కర్ సేవలు అభినందనీయం: రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాదం ప్రవీణ్..
వెంకటాపూర్ (ప్రజానాడి న్యూస్ ): భక్తి భావంతో పాటు అరుదైన సేవా దృక్పథం కలిగిన అధికారి రామప్ప ఆలయ ఈవో ఇమ్మడి భాస్కర్ అని ములుగు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బాదం ప్రవీణ్ కొనియాడారు.
ఆదివారం యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడమైన పాలంపేటలోని రామప్ప దేవాలయాన్ని దర్శించుకున్న అనంతరం, ఆలయ కార్యనిర్వహణ అధికారి ఇమ్మడి భాస్కర్ ను ఆయన ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా బాదం ప్రవీణ్ మాట్లాడుతూ, వందల ఏళ్ల నాటి రామప్ప ఆలయ ప్రధాన సోమసూత్ర ద్వార సమస్యను భారత పురావస్తు శాఖ (ఏ ఎస్ ఐ ) తో సమన్వయం చేసుకుని కేవలం ఐదు నెలల్లోనే పరిష్కరించడం మామూలు విషయం కాదన్నారు.
దాతల సహకారంతో భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న అభివృద్ధి పనులు ఎంతో అభినందనీయమని ప్రశంసించారు. విధి నిర్వహణలో నిబద్ధత, అలసత్వం లేని పనితీరు, వృత్తి పట్ల అంకితభావం భాస్కర్ ప్రత్యేకత అని, ఇదే స్ఫూర్తితో రామప్ప ఆలయ అభివృద్ధికి మరిన్ని కార్యక్రమాలు చేపట్టి ఉన్నత అధికారిగా పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీనివాస్, జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు కొమురవెల్లి రమేష్, రెడ్ క్రాస్ కోశాధికారి శిరుప సతీష్, రైస్ మిల్లర్స్ సంఘ కోశాధికారి ఎలగందుల మోహన్, ఉపాధ్యక్షులు అక్కల రఘు ఉత్తమ్, ములుగు ఆవోపా అధ్యక్షులు కొండ్లె కృష్ణమూర్తి, వ్యాపారవేత్తలు అక్కినపల్లి ప్రభాకర్, ఇమ్మడి రమణయ్య తదితరులు పాల్గొన్నారు..
🏠 Home