🏠 prajanadinews.in
Watermark
Newspaper Logo
prajanadinews.in | Date: 03 Sep, 2026 | Page: 1

భవిష్యత్తు పై బెంగతో యువకుడి ఆత్మహత్య...


వెంకటాపూర్( ప్రజానాడి న్యూస్) : భవిష్యత్తుపై బెంగతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటన ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో జరిగింది.పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలంపేటకు చెందిన పిట్టల సాగర్ (24) తల్లిదండ్రులు కొంతకాలం క్రితం చనిపోయారు. ఇల్లు, ఆస్తిపాస్తులు లేకపోవడం, పెళ్లి, భవిష్యత్తుపై ఆందోళనతో కొద్దిరోజులుగా మనస్తాపంలో ఉన్నాడు.సెప్టెంబర్ 1న మధ్యాహ్నం 1 గంట సమయంలో అన్న రత్నాకర్ కు ఫోన్ చేసి ఎక్కడున్నావని అడిగి కట్ చేశాడు. కొద్దిసేపటికే స్థానికులు రత్నాకర్ కు ఫోన్ చేసి సాగర్ ఎల్లమ్మ గుడి సమీపంలోని కాలువ వద్ద అపస్మారక స్థితిలో పడి ఉన్నాడని చెప్పారు.వెంటనే కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి చూడగా పక్కన పురుగుల మందు ప్యాకెట్ లభ్యమైంది. కుటుంబ సభ్యులు అతన్ని ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం 4 గంటలకు మృతి చెందాడు.మృతుడి సోదరుడు రత్నాకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
🏠 Home