🏠 prajanadinews.in
Watermark
Newspaper Logo
prajanadinews.in | Date: 30 Jul, 2026 | Page: 1

కేజ్‌వీల్స్‌తో రోడ్లపై ట్రాక్టర్లు నడిపితే జరిమానా:వెంకటాపూర్ఎస్సైచల్ల రాజు


వెంకటాపూర్ (ప్రజానాడి న్యూస్) :
రోడ్లపై ట్రాక్టర్లు కేజ్‌వీల్స్‌తో తిరిగితే జరిమానా తప్పదని వెంకటాపూర్ ఎస్సై చల్ల రాజు తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రోడ్లపై ట్రాక్టర్ కేజీ వీల్స్ తో వెళ్లాలంటే కేజి వీల్స్‌ కు వెడల్పు పట్టీలు పెట్టుకొని పోవాలని తెలిపారు. ట్రాక్టర్‌ కేజ్‌ వీల్స్‌తో రోడ్డుపై తిరిగితే మొదటిసారి రూ.5వేలు, రెండోసారి రూ.10 వేలు జరిమానాతోపాటు ట్రాక్ట ర్‌ సీజ్‌ చేస్తామన్నారు.ట్రాక్టర్ల యజమానులు ప్రభుత్వం కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు వేయిస్తే ట్రాక్టర్లు నడిపే వారు కేజ్‌వీల్స్‌ను ఉపయోగించి ధ్వంసం చేయడం సరి కాదన్నారు. నిబంధనలు ఉల్లంఘించి నడిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.
🏠 Home