అధిక రుసుము వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవు......
---- ఈ - డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్
--- తప్పుగా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన చర్యలే
--ఇకపై మీ సేవలో డిజిటల్ రశీదులు
ములుగు జులై 18: (ప్రజానాడిన్యూస్ )ములుగు మున్సిపాలిటీ పరిది లోని పలు మీసేవ కేంద్రాలను ఈ - డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్, మీసేవ మేనేజర్ విజయ్ తో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు.
కొత్తగా వచ్చిన పదవ తరగతి మేమో ప్రింట్, యూరియా బుకింగ్, ఫార్మర్ రిజిస్ట్రేషన్ మరియు వ్యవసాయేతర మార్కెట్ విలువ సర్వీసుల గురించి మీసేవ నిర్వాహకులకు వివరించారు. ఏ విధమైన టెక్నికల్ సమస్యలు వచ్చిన అతి త్వరగా క్లియర్ చేస్తామని ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ప్రతి అప్లికేషన్ నమోదు చేయాలని తెలిపారు.
కులం, ఆదాయం, నివాసం, జనన , మరణ కుటుంబ దృవీకరణ పత్రం, నేటివిటి, గ్యాప్ , నాన్ క్రిమీ లేయర్ వంటి సర్టిఫికేట్లు ఎన్ని సార్లు అయినా తీసుకునే వెసులుబాటు కలదని ఈ - డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్ తెలిపారు .
మీసేవ కేంద్రాలను ప్రజలకు ఇప్పుడు అందుబాటులో ఉండి ఈఎస్ డి గైడ్లైన్స్ ప్రకారం మీ సేవ కేంద్రాన్ని నడపవలనని సూచించారు. ఆపరేటర్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి అన్ని రకాల మీసేవ, భూభారతి మరియు మిగతా ఆన్లైన్ సర్వీస్ లను ప్రజలకు అందించాలని సూచించారు.
మీసేవ సెంటర్లో తప్పకుండా సిటిజెన్ చాప్టర్, భూభారతి కి సంబంధించిన ఫ్లెక్సీలు, మీసేవ లోగో, మరియు తాసిల్దార్, ఈడీఎం, పరిష్కారం కాల్ సెంటర్ల యొక్క ఫోన్ నెంబర్లు తప్పనిసరిగా ఉండవలెనని ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ ఆదేశించారు.
కళ్యాణ లక్ష్మి,యూడిఐడి (సదరం), బర్త్ మరియు డెత్ సర్టిఫికెట్లు ఎలాంటి తప్పులు లేకుండా నమోదు చేయాలని మరియు మీసేవ ఆపరేటర్లు ప్రజల పట్ల సున్నితంగా ఉంటూ వారికి మీసేవ సర్వీసులను మరియు ఇతర అన్ని రకాల ఆన్లైన్ సేవలను అందించాలని ఆదేశించారు.
నిర్ణీత రుసుము కంటే ఎక్కువ రుసుము దరఖాస్తుదారుడు నుంచి తీసుకున్నట్లయితే తప్పనిసరిగా అట్టి మీసేవ సెంటర్ పై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్ తెలిపారు.
అదేవిదంగా రాష్ట్రంలో పౌర సేవలను పారదర్శకంగా వేగవంతంగా అందించేందుకు ప్రభుత్వం నూతన విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. గ్రామ పాలనాధికారులు మరియు రెవిన్యూ ఇన్స్పెక్టర్లు వినియోగించుకునే విధంగా ప్రత్యేక మొబైల్ అనువర్తనాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇకపై పౌర సేవల దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, రెవెన్యూ సిబ్బంది నివేదికల సమర్పణ తదితర ప్రక్రియ మొత్తం ఆన్లైన్ విధానంలోనే కొనసాగుతుంది .
కాగిత రహిత విధానం అమలులోకి రావడంతో సమయానికి సేవలు అందడం, పారదర్శకత పెరగడం జరుగుతుందని ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ తెలిపారు.
ప్రస్తుతం ఆదాయం,కులం, నివాసం, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం, లేట్ రిజిస్ట్రేషన్ బర్త్ మరియు డెత్, అగ్రికల్చరల్ మార్కెట్ వాల్యూ , గ్యాప్ సర్టిఫికెట్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు.
మీసేవ ద్వారా అప్లై చేస్తే దరఖాస్తు తొలుత గ్రామ రెవెన్యూ పాలనాధికారి(జీపీవో)కి లాగిన్‌లోకి వస్తుంది. ఆయన విచారణ తర్వాత మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్(ఎంఆర్‌ఐ)కి, తదనంతరం ఆర్‌ఐ నేరుగా తహసీల్దార్ లాగిన్‌కి చేరవేరుస్తారని ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ తెలిపారు.
అలాగే కొత్త విధానం ప్రకారం మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకున్న వెంటనే దరఖాస్తుదారుడికి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. అందులో అప్లికేషన్ నెంబర్ సర్వీసు పేరు చెల్లించిన ఫీజు వివరాలతో పాటు ఒక హైపర్ లింక్ ఉంటుంది. పౌరులు ఆ లింకు పై క్లిక్ చేసి తమ రసీదును ఎప్పుడైనా వీక్షించవచ్చు డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా ప్రింట్ తీసుకోవచ్చు సర్టిఫికెట్ చేతికి వచ్చేవరకు ఈ ఎస్ఎంఎస్ ను సురక్షితంగా ఉంచుకోవాలని ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్ సూచించారు. దీనివల్ల కాగితాలు పోగొట్టుకునే భయం ఉండదు అలాగే మీసేవ అప్లికేషన్లో సదరు మెసేజ్ తిరిగి పంపించే సౌకర్యాన్ని కల్పించారని ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో మీసేవ జిల్లా మేనేజర్ పోలోజు విజయ్ మరియు మీసేవ సెంటర్ నిర్వాహకులు పాల్గొన్నారు.